ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని మరియు విజయం ఎప్పుడూ మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసారు.
Wishing our Hon'ble CM of AP @ysjagan a Very Happy Birthday! Wishing you good health, happiness and success always ?
— Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2019