2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగితే కొట్టించారు కూడా. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోకుడదని ప్రజలు దృడ నిశ్చయంతో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. తనని నమ్మి గెలిపించినందుకు జగన్ నిరంతరం వారికోసమే కృషి చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ఓడిపోవడంతో అధికార పార్టీపై ఎలాగైనా నిందలు వెయ్యాలని చూస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు తుళ్ళూరు రైతులను ఎలా మోసం చేసారో అందరికి తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు బండారం బయటపెట్టారు. “తుళ్లూరు రైతులు చంద్రబాబును ఇంకోసారి నమ్మితే అంతకంటే అమాయకత్వం ఉండదు. తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి వారిని ఫణంగా పెట్టాడు. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నాడు. ఎవరికీ అన్యాయం జరగదు. బాబును దూరం పెడితే అన్నీ పరిష్కారం అవుతాయి” అని అన్నారు.
