Home / MOVIES / సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్క్లుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది.

ఈ ఈవెంట్ కు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో సహా తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ కమెడియన్ ,నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ” నేను ఇంతకు ముందు సినిమాలు తీసుకున్నప్పుడు నా సినిమాను నా హీరోతోనే ప్రమోట్ చేసుకునేవాడ్ని.. కానీ సరిలేరు నీకెవ్వరు మూవీని ప్రమోట్ చేసుకుందామని అనుకుంటున్నాని అన్నాడు.

ముప్పై ఏళ్ల ముందు ఇండస్ట్రీలోకి వచ్చాను. మేనేజర్ గా కెరీర్ మొదలెట్టిన నేణు కమెడియన్.. నటుడుగా నటిస్తున్న నన్ను ఒక స్టార్ దయ వలన స్టార్ ప్రొడ్యూసర్ అయ్యానని ఈ సందర్భంగా తెలిపాడు. అయితే చిన్న టైం గ్యాప్ లో చాలా తప్పు చేశాను. ఇప్పుడే సుమ చెప్పినట్లు ‘7’ ఒ క్లాక్ బ్లేడ్ తో అది నీకు వేస్ట్ రా నీకు సినిమానే బెస్ట్ రా .. సినిమాల్లోనే ఉండాలి.. సినిమాల్లోనే జీవితం.. వెర్రి డ్యాష్ అన్పించుకుని నాకు నేనే మళ్లీ మీ ముందుకొచ్చాను అని తీవ్ర ఉద్వేగంతో మాట్లాడాడు. అయితే ఈ మూవీ తర్వాత నుండి నన్ను ఎవరు బ్లేడ్ గణేష్ అని పిలవద్దు ఘాటుగా వ్యాఖ్యానించారు.