టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది.
ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు.
అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ కొట్టిన షాట్ ను డ్రైవ్ చేస్తూ ఆపే క్రమంలో ధావన్ భుజానికి గాయమైంది. దీంతో అతడు మరల బ్యాటింగ్ కు దిగలేదు. ఎక్స్ రేకి వెళ్ళోచ్చాక ధావన్ తన ఎడమ చేతికి కట్టుతో కన్పించాడు.