మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ – యూకే ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్.
ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల మరియు అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన.. ప్రచారంలో భాగంగా ఇంటి ఇంటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరిస్తూ కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం ద్వారా రానున్న రోజులల్లో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుంది అని చెప్తూ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో భాగ్యస్వామ్యులు కండి అని పిలుపునిచ్చిన ఎన్నారై టీ.ఆరె.ఎస్ సెల్ – UK ప్రతినిధులు.
అటు సోషల్ మీడియా ద్వారా తెరాస మున్సిపాలిటీ అభ్యర్థుల గెలుపుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెరాస కార్యకర్తలు కృషి చేస్తున్నారని, అలాగే వివిధ దేశాల శాఖల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్ మీడియాకి తెలిపారు.