ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి మీడియా ఆలీని సంప్రదించగా మాట్లాడుతూ” నేను కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే బీజేపీ ఆఫీసుకోచ్చాను. ఇందులో ఎలాంటి రాజకీయ కానీ ఎలాంటి కారణాలు లేవు అని “తేల్చి చెప్పారు.