రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు. పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు దాన్ని ఎవరూ కాదనడు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా మైక్ పట్టుకుని ఊగిపోతూ ” భగత్ సింగ్ వారసుడ్ని, చే గువేరా తమ్ముడ్ని నేను సినిమాలు చేస్తే 1000కోట్లు వస్తాయి, కుటుంబాన్ని, సినిమాల్ని, పెళ్ళాల్ని వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాను” అని అటు బహిరంగ సభల్లోను, ఇటు దేశ, రాష్ట్ర మీడియాలో ఊదరగొట్టి, మధ్య మధ్యలో జగన్ లాగా నాకు వ్యాపారాలు లేవు నా మీద కొన్ని కుటుంబాలు ఆధారపడ్డాయి వాళ్ళని పోషించాలి అని నిట్టూర్పులు ఎందుకు..ధైర్యంగా నేను సినిమాలు చేసుకుంటున్నాను అని చెప్పొచ్చుగా?? రహస్య షూటింగ్లు ఎందుకు?? పాపం ఇప్పటికీ మా నాయకుడు సినిమాలు చెయ్యట్లేదు అని అమాయకత్వంతో ఆపార్టీ కార్యకర్తలు ఉన్నారు.
