Home / ANDHRAPRADESH / అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?

అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?

ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా తంటాలు పట్టాడు. ఇక అమరావతి ఆందోళన కార్యక్రమాలను రక్తి కట్టించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు..తొలుత అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ..జేఏసీ ఏర్పాటు చేయించి…తన సామాజికవర్గానికే చెందిన సీపీఐ రామకృష్ణ, నారాయణలతో ప్రభుత్వంపై విమర్శలు చేయించాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు ఎక్కువగా పాల్గోంటుడడంతో తన భార్య నారాభువనేశ్వరీని రంగంలోకి దింపి సెంటిమెంట్ పండించాడు. తన భార్యతో రెండు బంగారు గాజులు త్యాగం చేయించి విరాళాలు సేకరణ మొదలెట్టాడు. విరాళాల పేరుతో మహిళల గొలుసులు, దిద్దులు, బంగారు గాజులు, కాళ్లపట్టాల దగ్గర నుంచి ఒంటి మీద బంగారాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాడని సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడ్డాయి.

 

ఇదేదో డబ్బులొచ్చే స్కీమ్ బాగుందని..స్వయంగా జోలె పట్టి బిచ్చగాడి అవతారం ఎత్తాడు..అమరావతి ఉద్యమం కోసమంటూ… ఊరూరా తిరుగుతూ..జోలెపట్టి అడుక్కుంటూ…విరాళాలు సేకరించాడు. తన కొడుకు లోకేష్‌తో కూడా జోలెపట్టించి డబ్బులు అడుక్కునేలా చేశాడు. రాజధాని జిల్లాలలో అమరావతి సెంటిమెంట్ బలంగా ఉండడంతో బాబుగారి జోలెలో దండిగా డబ్బులు పడ్డాయి. గత నెలరోజుల్లో బాబుగారి జోలెలోకి కోట్ల రూపాయలు వచ్చాయని..టీడీపీ వర్గాల భోగట్టా…ఇక సంక్రాంతి పండుగను కూడా రాజకీయానికి వాడుకున్నాడు. జీఎన్‌రావు కమిటీ నివేదికలను భోగిమంటల్లో వేసి తగలెట్టి ఉద్వేగాన్ని రగలించాడు. సంక్రాంతి పండగ కూడా చేసుకోనివ్వకుండా రాజధాని గ్రామాల ప్రజలను పస్తులుంచాడు. తనతో పాటు తన భార్య, కోడలిని కూడా పస్తులుంచాడు..అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది..ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లుపై ముందడుగు వేసింది. అసెంబ్లీలో ఆమోదించింది.

 

అయితే చంద్రబాబు తన కుటిల రాజకీయంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించాడు కానీ తన కొడుకు ఎమ్మెల్సీ పదవికి ఎసరు పడుతుందని చంద్రబాబు ఊహించలేదు.మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవడంతో చిర్రెత్తిన సీఎం జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపాడు. ఇప్పుడు బంతి కేంద్రం చేతిలో ఉంది. ఇంకేముంది చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు ఎమ్మెల్సీ పదవి కాపాడుకోవడం కోసం ఢిల్లీ వేదికగా లాబీయింగ్ చేస్తున్నాడు. కేంద్రం శాసనమండలి రద్దును ఆమోదించకుండా ఆపే పనిలో చంద్రబాబు బిజీ అయిపోయాడు. తన పార్టీ ఎంపీలతో మీటింగ్‌లు పెట్టి పార్లమెంట్‌లో మండలి రద్దుపై రచ్చ చేయాలని క్లాసులు పీకుతున్నాడు…బీజేపీలో తన దోస్తు సుజనాతో కలిసి బీజేపీ పెద్దలను మండలి రద్దు చేయకుండా ఉండాలని బతిమాలే పనిలో ఉన్నాడు.

 

 

ఇక అమరావతి రైతులను పట్టించుకోవడం మానేసాడు..జోలె పట్టుకుని ఊరూరా తిరిగి అడుక్కోవడం మానేసాడు.పాపం అమరావతి రైతులు చంద్రబాబు మండలిలో చక్రం తిప్పాడని..పూలవర్షం కురిపించారు..కాని అసలు వాస్తవం ఇప్పడు తెలిసివస్తుంది..శాసనమండలి రద్దు దెబ్బతో ఇక చంద్రబాబు తమ వంక చూడడని…వాళ్లకు అర్థమైపోయింది. ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాస్తా..29 గ్రామాల నాయకుడిగా మిగిలిపోయాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమరావతి ఆందోళనలను నడిపించిన చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంకా అమరావతి ఆందోళనలను నడిపిస్తే చంద్రబాబు ఛాఫ్టర్ క్లోజ్ అని స్వయంగా టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారంట. ఇక శాసనమండలి రద్దుతో కంగు తిన్న చంద్రబాబు అమరావతి రైతుల ఆందోళనల జోలికి వెళ్లడం లేదు..తీరికగా మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటూ…వచ్చిపోయేవాళ్లకు దర్శనమిస్తూ..ఫోటోలు దిగుతూ కాలాక్షేపం చేస్తున్నాడు.మొత్తంగా అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి జోలెపట్టి ఊరూరా తిరుగుతూ వసూలు చేసిన కోట్ల రూపాయల మాటేంటి…ఆ డబ్బులు ఉద్యమానికి ఎంత ఖర్చుపెట్టారు…..వాటిలో ఎంత బాబుగారి జేబులోకి వెళ్లింది…ఎంత మాట…లోగుట్టు అంతా ఆ పెరుమాళ్లకే ఎరుక..సారీ సారీ బాబుగారికే ఎరుక…అయినా మనకెందుకులేండి..ఆ జోలె సంగతి..ఆ ఒక్కటి అడక్కండి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat