పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు టైటిల్ మరియు విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ సెట్ అవ్వలేదని. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఉగాది సందర్భంగా వస్తాయని ఆయన అన్నాడు. అంతేకాకుండా దీన్ని మే 15న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా మే 11 రిలీజ్ అయ్యిందని కాబట్టే ఇలా అనుకున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ ఎంట్రీ తరువాత వస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నారు.
