Home / NATIONAL / NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అయితే ఎన్ఆర్సీను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామంటూ పలుసార్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.