ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.
ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా వైసీపీలో చేరిన బీదా మస్తాన్ రావుల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే మండలిని రద్దు చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మండలి రద్దు అయితే మంత్రి మోపిదేవి వెంకటరమణను ఎంపీగా పెద్దలసభకు పంపించే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి వైసీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో..?