Home / SLIDER / మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు

మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు.. నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

అందులో భాగంగా నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర ఉన్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 1870లోనే నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ మొదలైంది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ ,1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యాయి. మీ పార్టీ పుట్టకముందే తెలంగాణలో రైలు పుట్టింది. మీకే రైలు అంటే తెలియదు అని విరుచుకుపడుతున్నారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌ గల్లీ నుంచి ఢిల్లీకి పంపిన ప్రజల రుణం తీర్చుకోవాల్సింది పోయి అవమానించారని వారు మండిపడుతున్నారు.

తెలంగాణాకు రైల్ తెచ్చినట్టే జర గా ఓడ రేవును కూడా తీస్కరాయే కిషన్ రెడ్డి అన్న.అప్పట్లో భుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు..అప్పట్లో బొల్లి నాయుడు ఇప్పుడు నిస్సహాయ మంత్రి..ఆ మాట్లాడింది ఏదో హిందీ లో మాట్లాడిన బాగుండు@కిస్మత్ MP.కనీసం నీ #బోడి మాటల #షా కు అయినా తగిలేది ,అస్సాం పాకిస్తాన్ వాళ్లకు.రైల్వే అంటే వాళ్లకు తెలియదు – కిస్మత్ MP,నువ్వేడ పుట్టినవ్ అస్సాం లోనా పాకిస్తాన్ లోనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.