ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సంతోషం వ్యక్తం చేయకుండా తిరిగి ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఆయన ఎన్ని చెప్పినా నమ్మరన్న విషయం బాబుకు తెలిసినా ఏదోక రకంగా జగన్ పై విమర్శలు గుప్పించాలి అనేది ఆయనకు కావాల్సింది. మరోపక్క తండ్రి విషయం ఇలా ఉంటే కొడుకు కూడా అదే రూట్ ని ఫాలో అవుతన్నాడు తప్ప ఈతరం వ్యక్తిలా ఆలోచించకుండా అధికారం కోసం కొట్టిమిట్టలాడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు” అని అన్నారు.