Home / ANDHRAPRADESH / పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు.

తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు.

పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.