తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మరణంపై పోలీసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.మారుతీరావుది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు కానీ ప్రూప్ లు కానీ పోలీసులకు లభించలేదు. అయితే మరోవైపు మారుతీరావు యొక్క పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు.
మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు ఆదివారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఆర్యవైశ్య భవన్కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు.ఇలా పలు అంశాలపై పోలీసులు దర్యాప్రు చేస్తున్నారు.