తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దాని చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల్లో ఉన్న పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.
లంబినీపార్క్, ఎన్టీఆర్‌గార్డెన్, ఎన్డీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు.
జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జలవిహార్, నెహ్రూ జువలాజికల్ జూపార్క్, ఇందిరా పార్క్, ఆక్సిజన్ పార్కులతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోని పార్కులను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.