Home / SLIDER / సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?

సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు.

దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు.

ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు స్టేషన్లకు వెళ్లి తమ వివరాలతో పాటుగా ఉద్యోగం చేస్తున్నట్లు ఐడీ కార్డు,హాస్టళ్లు మూసివేశారనే ప్రూఫ్ ను సమర్పిస్తే పోలీసులు అనుమతి పత్రాలిస్తారు. దీంతో ప్రయాణించేటప్పుడు ఎక్కడైన సరే పోలీసులు ఆపితే దీన్ని చూపిస్తే పోలీసులు వెళ్లడానికి అనుమతిస్తారు.