Home / SLIDER / కరోనా కట్టడికై ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి

కరోనా కట్టడికై ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి

జిల్లాలో కరోనాకు రెండు సాంకేతిక బృందాలను నియమించామని, వైదులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు బాగా కష్టపడుతున్నారని, నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ మంత్రి చేతుల మీదుగా మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికై ప్రజలు ప్రభుత్వ సూచనలను, నిబంధనలను విధిగా పాటించాలని, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. కాగా హైదరాబాదులో 200 బెడ్స్ కలిగిన రష్ ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్. నవీన్ సామజిక సేవలో భాగంగా తనవంతు సాయంగా సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ అందించడం పట్ల వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ ఓపీ ఏలా ఉంది.? ఏలాంటి కేసులు వస్తున్నాయని, కరోనా విషయమై క్వారంటైన్, ఐసోలేషన్ వార్డు కేసులు ఏలా చూస్తున్నారని వైద్యాధికారులను మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మెడికల్ కళశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, డీఏంహెచ్ఓ మనోహర్, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat