దక్షిణాది పరిశ్రమకి చెందిన నటి ఉషారాణి(62) జూన్ 21న కన్నుమూశారు. కిడ్నీ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తమిళం, మలయాళ భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఉషారాణి మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
మలయాళ దర్శకుడు శంకర్ నాయార్ని 1971లో వివాహం చేసుకున్నారు ఉషారాణి. 2006లో ఆయన కన్నుమూయగా, ఉషారాణి కన్నా శంకర్ నాయార్ 30 సంవత్సరాలు పెద్ద అని తెలుస్తుంది.
కెరీర్లో 100కి పైగా సినిమాలలో నటించిన ఆమె ఎక్కువగా మలయాళ చిత్రాలు చేశారు.ఉషా మృతిపై దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉషారాణి మృతికి నివాళులు అర్పించారు