Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 879కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 879కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 879కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 652 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,553కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇందులో 5,109యాక్టివ్ కేసులు ఉన్నయి.నిన్న ఒక్క రోజే 219మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,224మంది కరోనా నుండి కోలుకున్నారు.నిన్న మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.ఇప్పటివరకు మొత్తం 220కరోనా మరణాలు సంభవించాయి.

మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14,కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.