తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నితిన్ పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెల్సిందే.
లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో నితిన్ ప్రకటించారు.తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైందని వార్తలు విన్పిస్తున్నాయి.ఇందులో భాగంగా వచ్చే నెలలో నితిన్ వివాహాం జరగనున్నట్లు సమాచారం.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమైనట్లు సమాచారం.అయితే మరోవైపు లాక్డౌన్ సమయంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్,హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్న సంగతి విదితమే..