Home / NATIONAL / మాస్కులు తయారీ కంపెనీలో కరోనా

మాస్కులు తయారీ కంపెనీలో కరోనా

కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మాస్కులు త‌యారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే ఆ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే 40 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసిన‌ 70 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి గురువారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ప్లాంట్ నిర్వాహ‌కులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వల్లే 70 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు