Home / SLIDER / మొక్కలు నాటిన హీరో జాకీర్

మొక్కలు నాటిన హీరో జాకీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లితెర నటుడు రవి కిరణ్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన హీరో జాకీర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమితాబచ్చన్ నుండి చిన్న ఆర్టిస్ట్ వరకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న కు కృతజ్ఞతలు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మనం మొక్కలు నాటాలని మన చిన్నతనంలో మనము మంచి నీళ్లు బోర్ నీరు తాగే వాళ్ళమి కానీ ఈ తరం వారు బిస్లరీ వాటర్ తాగుతున్నారు అని.

అదేవిధంగా ఇప్పుడు మనం మొక్కలు నాటకపోతే భవిష్యత్ తరాల వారు ఆక్సిజన్ సిలిండర్ వీపు పై వేసుకొని రావాల్సి వస్తుందని కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం మొక్కలను నాటి సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ప్రజలలో చైతన్యం రావడం కోసమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

దీంతో పాటు నేను మరొక ఇద్దరికీ సనా మేడం; అశోక్ కుమార్ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ;ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.