Home / SLIDER / తెలంగాణలో కొత్తగా కొత్త‌గా 1811 క‌రోనా కేసులు

తెలంగాణలో కొత్తగా కొత్త‌గా 1811 క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వ‌తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కకు పెరిగారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేర‌కు రాష్ట్ర వైద్య‌ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చ‌ల్‌లో 151, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 102, క‌రీంన‌గ‌ర్‌లో 97, న‌ల్ల‌గొండ‌లో 61, నిజామాబాద్‌లో 44, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 41, మ‌హ‌బూబాబాద్‌లో 39, సూర్యాపేట‌లో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్ల‌లో 30, గ‌ద్వాల‌లో 28, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 27, ఖ‌మ్మంలో 26, సిద్దిపేట‌లో 24, వ‌న‌ప‌ర్తిలో 23, జ‌న‌గామ‌లో 22, పెద్ద‌పెల్లిలో 21, భూపాల‌ప‌ల్లిలో 20, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 18 చొప్పున పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

రాష్ట్రంలో కొత్త‌గా 18,263 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,16,202 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri