Home / ANDHRAPRADESH / కరోనాపై ఏపీ ప్రజలకు శుభవార్త..

కరోనాపై ఏపీ ప్రజలకు శుభవార్త..

ఏపీ ప్రజలకు శుభవార్త కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డా. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో 15శాతం పైనే హెర్డ్‌ ఇమ్యూనిటీ గుర్తించినట్లు తెలిపారు.శనివారం నుంచి శీరోసర్విలెన్స్‌ భారీగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

ఆగస్టు 21 నుంచి కర్నూలు, తూ.గో జిల్లాల్లో.. సెప్టెంబర్‌ 4 నుంచి గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.