Home / MOVIES / క్షీణిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం

క్షీణిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్‌ కౌర్‌ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు.

ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది.

దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు. నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని మొత్తం 12 మంది సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో నవనీత్ కౌర్ పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు.