Home / SLIDER / మొక్కలు నాటిన గణేష్ రెడ్డి….

మొక్కలు నాటిన గణేష్ రెడ్డి….

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీనగర్ కాలనీ లో మొక్కలు  నాటిన గణేష్ రెడ్డి….

అనంతరం ఆయన  మాట్లాడుతూ అడవులు అన్ని హరించి పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు మాత్రం హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి మన దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నటి మంజీర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీ లోమొక్కలు నాటిన నటుడు గణేష్ రెడ్డి.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నానని తెలిపారు.అనంతరం మరో ముగ్గురు( నటులు నిఖిల్ నైర్ , కిరణ్ కాంత్ , సక్కత్ హుడుగా ) లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటి మరికొంత మందికి ఛాలెంజ్ విసరాలని కోరుతున్నానని నటుడు గణేష్ రెడ్డి అన్నారు….