స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్రను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు.
శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.
కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్త విన్న చిత్ర పరిశ్రమ ఆయనకు నివాళులు అర్పిస్తుంది.