Home / NATIONAL / కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డు

కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31,07,223. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది