Home / SLIDER / 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పదిహేడు మంది ఎంపీలకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో ఎంపీలకు కోవిడ్ పరీక్షలు అనివార్యం చేశారు. మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డారు.

ఇతరుల్లో సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జి, ప్రతాపరావు పాటిల్, రామ్ శంకర్ కథేరియా, సత్యపాల్ సింగ్, రాడ్మల్ నగర్ ఉన్నారు. ఆది, సోమవారాల్లో ఎంపీలకు ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన జేఎంఎం నేత శిబు సోరెన్, డీఎంకే ఎంపీ టి.శివ తదితరులు సోమవారంనాడు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ కారణంగానే ఎంపీలు సంతకం చేసిన పెన్నులను ఎప్పటికప్పుడు మార్చారు. విజిటర్స్ గ్యాలరీలోనూ సామాజిక దూరం పాటించడం కనిపించింది.