Home / NATIONAL / దేశంలో కొత్తగా 55, 838కరోనా కేసులు

దేశంలో కొత్తగా 55, 838కరోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ వ‌రుస‌గా రెండ‌వ రోజు 50 వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 55,838 మందికి వైర‌స్ సంక్ర‌మించింది.

దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 702 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,16,616కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,15,812 కాగా, గ‌త 24 గంట‌ల్లో 24,278 కేసులు త‌గ్గాయి. మొత్తం కోలుకున్న‌వారిలో 68,74,518 మంది ఉన్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో హాస్పిట‌ళ్ల నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో 79,415 మంది ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.