తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజులుగా 1481, 1504, 1531 కేసులు నమోదయ్యాయి.
కేసుల సంఖ్య పెరిగితే పండుగ సందర్భంగా వైరస్ వ్యాప్తి మొదలైనట్లు భావించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గురువారం 43,790మందికి పరీక్షలు చేయగా మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది. మరో ఆరుగురు మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది.