Home / ANDHRAPRADESH / ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతి

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు బైకుపై వెళ్తున్నాడు.

ఈ క్రమంలో చలి వేస్తోందని చౌటుప్పల్ దగ్గర ఆగాడు. స్వెట్టర్ వేసుకుంటుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకుపై కూర్చున్న ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితునికి ఎలాంటి గాయాలు కాలేదు