Home / SLIDER / హైదరాబాద్ కి కష్టం వస్తే సహాయం అందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా-మంత్రి కేటీఆర్

హైదరాబాద్ కి కష్టం వస్తే సహాయం అందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా-మంత్రి కేటీఆర్

• ఇప్పటికే ఈ సంవత్సరం లో 1,200 మిల్లీమీటర్ల వర్షం హైదరాబాద్ లో పడింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పడింది
• గతంలో వర్షం సంవత్సర కాలం మొత్తం కురిస్తే ప్రస్తుతం వాతావరణ మార్పుల వలన ఒకేసారి కుంభవృష్టిగా వర్షాలు హైదరాబాద్ లో పడ్డాయి
• మొన్న జరిగిన వర్షాలకి వందలాది కాలనీలు వరదలో మునిగినాయి
• తెలంగాణలో భారీ వర్షాలు పడినప్పుడు ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో ప్రజలంతా గమనించారు
• కష్ట సమయంలో ప్రజల వెంట పార్టీ, ప్రభుత్వం నిలబడింది
• దేశంలో ఏ మెట్రో నగరానికి లేనివిధంగా హైదరాబాద్ నగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది… 800 మంది కలిగిన ఈ బృందం వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నాతో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు అంతా కూడా ప్రజల్లో ఉండి సహాయక చర్యల్లో ప్రజలకు అండగా నిలబడ్డారు
• నేను స్వయంగా పదుల సంఖ్యలో కాలనీలలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాము
• తక్షణ ఉపశమనం, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
• వరద కష్టాలను ప్రత్యక్షంగా నాది బాధితులు వివరించినప్పుడు నేను చలించిపోయాను

• మేమంతా ముఖ్యమంత్రి గారికి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని, పరిస్థితులను వివరించి చెబితే పేదల కష్టాలు తెలిసిన మనసున్న మా ముఖ్యమంత్రి, వర్షాలు కురిసినప్పటికీ 550 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు
• గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇంత పెద్ద ఎత్తున తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించింద… దేశంలో అతిపెద్దది తక్షణం ఆర్థికసాయం ఇదే
• ఇప్పటిదాకా నాలుగు లక్షల 30 వేల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించింది.
• తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన దసరా పండగలో ప్రజలకు ఆర్థిక సాయం అందాలనే ఉద్దేశ్యంతో 920 బృందాలతో ఒక లక్ష మందికి ఒకటే రోజు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం మాది
• కొంతమంది మిగిలిపోయారని సమాచారం రావడంతో… తిరిగి మరోసారి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు
• మేము ప్రజలకు వరద సహాయం చేస్తూఉంటే కాంగ్రెస్,బి.జె.పి లు బురద రాజకీయం చేస్తున్నాయి
• హైదరాబాద్ నగర ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉంటే ప్రతిపక్షాలు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్నాయి
• ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటేనే అది అసలైన నాయకత్వం ..ఆ నాయకత్వం మా ముఖ్యమంత్రి గారిది
• విపత్తులో రాజకీయం చేయడం తప్ప విజ్ఞతతో వ్యవహరించనీ ప్రతిపక్షాలు మన దగ్గర ఉన్నాయి
• వరద సహాయక చర్యలపై మాత్రమే దృష్టి సారించి రాజకీయాలు చేయలేదు.. కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ అధికారులను సైతం బెదిరిస్తున్న పార్టీలు హైదరాబాద్లో ఉన్నాయి

• మా దగ్గర ప్రతి ఒక్క లబ్ధిదారుని ఫోటోతో సహా సంపూర్ణ సమాచారం జిహెచ్ఎంసి వద్ద ఉంది ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు
• సహాయం తీసుకున్న తమ పార్టీ కార్యకర్తలతోనే రాజకీయం చేస్తున్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు
• 8868 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రంలో వరదలు వలన జరిగిందని 25 రోజుల కింద ప్రధానమంత్రికి ఉత్తరం రాసిన… ఇప్పటిదాకా స్పందన లేదు
• కానీ ఇదే ప్రధానమంత్రి కర్ణాటక లో వరదలు వస్తే నాలుగు రోజుల్లో 669 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి విడుదల చేసింది
• 2017లో గుజరాత్ ముఖ్యమంత్రి అడగగానే 500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆ రాష్ట్రానికి ప్రకటించింది
• కర్ణాటక గుజరాత్ ముఖ్యమంత్రులు కేంద్రానికి ఉత్తరం రాసిన వెంటనే నిధులు వస్తాయి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రాస్తే కనీస స్పందన కూడా లేదు
• తక్షణ సహాయం కింద పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయమన్న ఇప్పటిదాకా బుడ్డ పైసా కూడా
• దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా…
• హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి కష్టం వస్తే సహాయం అందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా
• ఒక రూపాయి కూడా హైదరాబాద్ కి ఇవ్వనందుకు మన నగరం మన బిజెపి అంటున్నారా
• రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో కడితే తెలంగాణకు ఇచ్చింది కేవలం లక్షా 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అంతకుమించి ఒక్క రూపాయి కూడా రాలేదు
• కిషన్ రెడ్డి సహాయ మంత్రి కాదు నిస్సహాయ మంత్ర అని తెలుసుకోవాలి

• నలుగురు ఎంపీలు కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి తెలెని అసమర్థత వాళ్ళ ది
• నాలాల, చెరువుల పైన ఆక్రమణలో ఉన్నాయని చెలరేగిపోయి మాట్లాడే ప్రతి పక్షాల హయాంలోనే 28వేల ఆక్రమణలు ఉన్నాయని చెప్పింది కాంగ్రెస్ హయాంలోనే
• సహాయం చేస్తే చేయాల్సింది పోయి విమర్శలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్
• కనీసం మా ఎమ్మెల్యే ల మాదిరి ఒక నెల జీతం అయిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చినద
• వీళ్లు నగరంలో పరిపాలన చేస్తున్నప్పుడు పేదలకు సుస్తీ చేస్తే బస్తి దావఖాన పెట్టాలనే ఆలోచన వీళ్లకు వచ్చిందా
• కనీసం హైదరాబాదులో టాయిలెట్లు పెట్టాలన్న ఆలోచన వచ్చిందా
• మేము అన్ని పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా మార్చాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది
• ఇవన్నీ చేస్తుంటే కడుపు మండి…ప్రజలు ఎక్కడ తమ రాజకీయ ఉనికి లేకుండా చేస్టారో అన్న అక్కసుతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి
• కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం… ఇప్పటికే 550 కోట్లు కేటాయించాం… అవసరమైతే మరో వంద కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని కోరతాం… పేద వారిని ఆదుకొని ముఖ్యమంత్రిని కోరుతున్నాం…ప్రతి ఒక్క వరద ప్రభావిత కుటుంబానికి సహాయం అందేలా చూస్తుంది…ఎవరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు… ప్రతి ఒక్కరికి అధికారులు ఇంటి కాడికి వచ్చి తక్షణ ఆర్థిక సహాయం అందిస్తారు.. రాజకీయ పార్టీల కుళ్లు రాజకీయాలకు లోనుకావద్దు….

• ప్రజలు ఎవరూ కూడా బాధపడవద్దు… భయపడవద్దు…
• హైదరాబాద్ చుట్టూ ఉన్న 22 మునిసిపాలిటీల్లో వరద నష్టం జరిగింది..వారి అందరికీ సహాయం చేస్తున్నము. మొన్న వరద వస్తే వరంగల్ కి 20 కోట్లకు పైగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాము
• ఎన్నటికైనా హైదరాబాద్ నగర ప్రజల కష్టాలు తొలగించ గలిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి