తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్శ్జింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మంగళవారం తెల్లారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో అసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన నకిరేకల్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,మాజీ మంత్రి జానారెడ్డిపై నాగార్జున సాగర్ నుండి ఆయన గెలిచి తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.