తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,470కు చేరుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులున్నాయి. 2,62,751 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 59,471 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.