Home / MOVIES / రష్మిక రోమాన్స్

రష్మిక రోమాన్స్

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పొగరున్న  ఓ యువకుడి జీవిత గమనంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. భారీ పోటీ మధ్య ఈ చిత్రం తెలుగు హక్కులను మూడు కోట్ల ముప్పై లక్షలకు సొంతం చేసుకున్నాం.

ఈ సినిమాలోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాటకు తెలుగులో  43 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ధృవ సర్జా, రష్మిక మందన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్ని  ఉత్కంఠను పంచుతాయి. త్వరలోతెలుగు టైటిల్‌ను నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా,  చందన్‌శెట్టి.