వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.
సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేతని ప్రకటించే సమయంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్‌లలో ఎవరైన రూ. 25 లక్షలు తీసుకొని బయటకు రావచ్చు అనగానే సోహైల్ ఏ మాత్రం ఆలోచించకుండా రూ. 25 లక్షలు ఉన్న సూట్ కేసుతో బిగ్ బాస్ హౌజ్ గడప దాటాడు. ఆయన నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది.
సోహైల్ రూ. 25లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా చూపెడుతున్నారు. ఇటీవల బిగ్ బాస్ నిర్వహించిన రీయూనియన్ పార్టీలో ఇంట్లోకి వెళ్లిన మెహబూబ్ ..సోహైల్‌లకు చేతులతో సైగలు చేశాడు. నువ్వు విజేత అయ్యే ఛాన్స్ లేదు మనీ ఇస్తే తీసుకొని రా అంటూ చిన్న హింట్ ఇచ్చాడు. దీనిని మైండ్‌లో పెట్టుకొనే సోహైల్ రూ. 25 లక్షలతో బయటకు వచ్చేశాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.