Home / SLIDER / డ్యాన్స్‌ ఇరగదీసిన అన‌సూయ

డ్యాన్స్‌ ఇరగదీసిన అన‌సూయ

బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన కూడా ఇప్ప‌టికీ  గ్లామ‌ర్ షోతో యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.

ఓ వైపు బుల్లితెర షోస్ మ‌రోవైపు సినిమాలు మ‌ధ్య‌మ‌ధ్య‌లో సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ల‌తో త‌న అభిమానుల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియో షేర్ చేయగా, దీనికి నెటిజ‌న్స్ తెగ ఫిదా అవుతున్నారు.

ప్రభాస్, త్రిష కాంబినేషన్లో తెర‌కెక్కిన  వర్షం సినిమా ఎంత పెద్ద హిట్లో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో సాంగ్స్‌కు కూడా వీరాభిమానులు ఉన్నారు. ఝూలే ఝూలే అనే పాట చాలా మందికి ఫేవ‌రేట్ కాగా, తాజాగా ఈ పాట‌కు అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది.

ఇందులో బీట్‌కు త‌గ్గ‌ట్టు న‌డుమూ ఊపుతూ హోయ‌లు పోయింది. అన‌సూయ డ్యాన్స్ వీడియో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం అనసూయ థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్, రంగ‌మార్తాండ‌, ఖిలాడి, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది.