చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్లకు 257 పరుగులతో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లి సేన.. మరో 80 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన తర్వాత అవతలి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో సుందర్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పటికీ ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు వెనుకబడి ఉంది.