తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు,అశేష జనానికి ఒక పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా ఈ నెలఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందామని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
పిల్లలతో కలిసి మొక్కలు నాటుతున్న వీడియోను ట్వీట్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చని తెలిపారు.