హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ హీరో.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోటాలగూడెంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది..
షూటింగ్ కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.