Home / MOVIES / బాలయ్య కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా..?

బాలయ్య కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు,ప్రముఖ నటుడు,హిందుపూరం ఎమ్మెల్యే యువరత్న  బాలకృష్ణ హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు.

జూబ్లీహిల్స్ లో రూ 15 కోట్లకు రెండంతస్తుల ఇంటిని కొన్నారని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ ఇల్లు 9,395 చ.అ విస్తీర్ణంలో ఉందని తెలిపింది.

స్టాంప్ డ్యూటీ కింద రూ.82.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీ కింద రూ 7.5 లక్షలు చెల్లించారని పేర్కొంది. ఇదే ఏరియాలో ఓ ఫార్మా కంపెనీ యజమాని రూ.41.3 కోట్లతో ఇంటిని కొన్నారు..