Home / SLIDER / సయ్యద్ అఫ్రీన్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

సయ్యద్ అఫ్రీన్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగులో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగంను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగు భాషా సాహిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది.

ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేండ్లలోనే పీహెచ్‌డీ పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, ప్రొఫెసర్‌ కనకయ్య పాల్గొన్నారు.