Home / SLIDER / బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

నర్సంపేటకు పట్టభద్రుల ఎన్నికలనగానే ఓటు అడగడానికి నర్సంపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు..
బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని నర్సంపేటకు వస్తున్నావు. ఈ ప్రాంత రైతుల పొట్టకొడుతున్న మీరు ఇక్కడ ఓట్లడగటానికి అర్హులనుకుంటున్నారా? నర్సంపేట రైతుల 100 ఏండ్ల కల ఐన రామప్ప-పాకాల & రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టిన మీరు సిగ్గులేకుండా ఓటు అడగటానికి వస్తుండటం సిగ్గుచేటు.. దేశ రాజదాని డిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే చీమైన కుట్టనట్టు ఉంటూ రైతు చట్టాలతో రైతులను ఆగం చేసింది మీరుకాదా.? కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కుట్రలను ఛేదించి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా మేము తెచ్చుకొని, పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ లను అడ్డుకుని రైతులకు నీళ్ళు రాకుండా చేయజూస్తుంది నీ పార్టీ బీజేపీ కాదా..? లక్ష ఎకరాలకు రెండు పంటలకు నీళ్ళిచ్చే రామప్ప – పాకాల, రామప్ప – రంగాయ చెరువు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న దద్దమ్మలు నేడు నర్సంపేటకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారో సమాదానం చెప్పాలి.. నోరు తెరిస్తే అబద్దాలు, అసత్యాలు తప్ప నీకు సబ్జెక్ట్ పై మాట్లాడటం చేతకాదని ప్రజలకు అర్దమైపోయింది..
పిచ్చికూతలు కట్టిపెట్టి, మత, కుల విద్వేశాలు రెచ్చగొట్టుడు ఆపి మేం అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పు..? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుబెట్ట చూస్తుంది బీజేపీ.. రాష్ట్రాన్ని కుట్రలకు, మత విద్వేశాలకు, అశాంతికి కేంద్రంగా బీజేపీ పార్టీ మార్చాలనుకుంటుంది నిజం కాదా..? ఎంపీగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న నీ పార్టీ ద్వారా నువ్వు సాదించినదేంటో, తెచ్చిన నిదులెన్నో సమాదానం చెప్పగలవా..? కేంద్రం నుండి తెలంగాణాకు రావాల్సిన వాటాను తీసుకురాలేని సన్నాసులు, దద్దమ్మలు మీరు.. మీలు తెలంగాణాలో ఓట్లు అడగటం సిగ్గుచేటు.. నెల రోజుల్లో వందకు పైగా గ్యాస్ దరను పెంచి, పెట్రోల్ ను 100 రూపాయలు చేసి మద్యతరగతి కుటుంబాలపై పెను బారాన్ని మోపుతున్నందుకు మీకు ఓటేయాలా..? దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ లకు కట్టబెట్టి దేశాన్ని అమ్ముతూ లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసినందుకు ఓటేయాలా..? రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పోరేట్ ల చేతుల్లో పెడుతున్నందుకు ఓటేయాలా..? దేశమంతా రైతులు పోరాటం చేస్తుంటే చీమ కుట్టనట్టుగా మొండి వైఖరి అవలంబిస్తూ స్పందించకపోగా, రైతులను పొట్టన పెట్టుకున్నందుకు ఓటేయాలా..? తెలంగాణా ప్రాజెక్టులు అడ్డుకుంటు రైతుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నందుకు ఓటేయాలా..? వీటన్నీటికి సమాదానం చెప్పాక నర్సంపేటలో ఓటు అడుగు..
మేం బాజాప్తాగా లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాం.. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిన నీ బీజేపీ మాటలు నీటి మూటలేనా.. ఇలాంటి మీరు టీఆర్ఎస్ పై విమర్శ చేసే ముందు సోయితో మాట్లాడండి.. ఇక్కడ కొచ్చి పిచ్చి చేష్టలు, చిల్లర మాటలు మాట్లాడకుండా మేం అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పు.. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే జనం మిమ్ములను నమ్మరు.. ఐటిఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ గారు రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర… సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ గారి అజ్ఞానానికి నిదర్శనం. తెలంగాణా సాదించింది మేము.. అభివృద్ది చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ.. అలాంటిది తెలంగాణా అభివృద్దికి అడ్డం పడుతూ తెలంగాణపై సోయిలేకుండా ప్రజల మద్య చిచ్చు పెట్టజూస్తున్న మీమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారు?. తెలంగాణా కోణంలోనే ప్రజా తీర్పు ఉంటుంది. దేశాన్ని అమ్మేస్తూ, తెలంగాణాకు అన్యాయం చేస్తూ మా ప్రాజెక్ట్ లకు అడ్డం పడుతున్న మీకు తప్పకుండా ప్రజలు బుద్ది చెబుతారు.. మా ప్రశ్నలకు సమాదానాలు చెప్పి ఈ ప్రాంతంలో ఓట్లు అడుగు.. సబ్జెక్ట్ లేకుండా ప్రజల మద్య విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు తగిన బుద్దిచెపుతారు. కావున పై ప్రశ్నలకు బండిసంజయ్ గారు సమాధానాలు చెప్పగలరు..