టాలీవుడ్ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయబోతున్నట్టు శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.కోర్టు రూం డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బోనీ కపూర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.హిందీలో అమితాబ్ బచ్చన్-తాప్సీ లీడ్ రోల్స్ లో నటించిన పింక్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.