తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరాం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ధియేటర్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత కొనసాగుతోంది.
పవర్ స్టార్ యుఫొరియాతో ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం విడుదలైన 24గంటల్లో 22.44మిలియన్ సాధించి టాలీవుడ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అంతేకాదు… వేగంగా 23గంటల 39 అత్యంత నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ నమోదు చేసింది. పవన్ కంబ్యాక్ మూవీ కావడంతో.. ఫ్యాన్స్ ‘వకీల్ సబ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 9న మూవీ విడుదల కానుంది