తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.