తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు.
త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటవ్ నిర్ధారణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోంఐసోలేషన్‌లో ఉన్నారు.నిన్న బుధవారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సిటీ స్కానింగ్‌తోపాటు మరికొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.