కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
